Reading Time: < 1 minute

మన తెలంగాణ/గోషామహల్/హైదరాబాద్: గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని ట్విన్‌సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేని పక్షంలో నగరంలోని ఆసుపత్రులకు మం దుల సరఫరాను నిలిపి వేస్తామని హెచ్చరించింది. ఈ విషయమై ఇప్పటికే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు ఇచ్చిన అసోసియేషన్ నా యకులు, గురువారం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెం డెం ట్‌కూ నోటీసులు అందించినట్లు తెలిసింది. బకాయిలు చెల్లించక పోవడంతో గత్యంతరంలేక మందుల సరఫరాను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందాల రామచందర్ పేర్కొన్నారు. 2022 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల మెడిసిన్ సరఫరాకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం చెల్లించడంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కార్డియాలజీ, కార్డియో థొరాసిక్,

ఆప్తాల్మాలజీ, న్యూరో సర్జరీ, ఆర్ధో ఫెడిక్ విభాగాలకు సంబంధించిన స్టంట్స్, సర్జిక ల్స్, డిస్పోజబుల్స్, ఇంప్లాంట్స్, కిట్స్‌లతో పాటు లివర్, కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌కు సంబంధించిన డిస్పోజబుల్స్, ఇంప్లాంట్స్ సరఫరా చేస్తు న్నా, సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. 2024 లో సిఎంని కలిసి వినతిపత్రం సమర్పించినా బకాయిపడిన మం దుల బిల్లులకు మోక్షం లభించలేదని, యేడాదిగా ఆరోగ్యశ్రీకి సం బంధించిన బిల్లులు సైతం చెల్లించక పోవడంతో మెడిసిన్ సప్లయర్స్‌కు మందుల సరఫరా చేయడం తలకుమించిన భారంగా మా రిందన్నారు. 2025లో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సం బంధించి సుమారు రూ.60 కోట్ల బకాయిలు ఉండగా, టీజీఎస్ ఎంఎస్‌ఐడీసీ నుండి రూ.60కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 70 శాతం మందుల సరఫరాను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మిగతా 30 శాతం ఎమర్జెన్సీ మెడిసిన్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.