Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి వార్షి క పరీక్షలు శనివారం(మార్చి 14) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,17,727 మంది పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,60,916 బాలురు, 2,56,811 బాలికలు ఉన్నారు. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యం లో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షల ప్రారంభానికి ఒకటి రెండు రోజుల ముందు పరీక్షా కేం ద్రాలను సందర్శించాలని సూచించించింది. పరీక్షలు జరిగే రోజుల్లో కేంద్రాల వద్ద 144 సెక్షన్ (బిఎన్‌ఎస్‌ఎస్ 163) అ మలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందు కు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి ఉండదు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదు. హాల్‌టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్ పె న్సిల్, షార్ప్‌నర్, ఎరాయిజర్, జామెట్రిక్ పరికరాలతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు. అయితే, విద్యార్థులు పెన్ను లు, ఎరాయిజర్, జామెట్రీ బాక్స్‌లు ఒకరి నుంచి ఒకరు తీసుకునేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు.

వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈసారి వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిని ప్రింట్ తీసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. అలాగే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ bsc.telangana.gov.in ద్వారా పొందవచ్చు. ఈసారి కొత్తగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు.

పరీక్షల టైం టేబుల్ ఇలా..

పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్‌కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు.

విద్యార్థులకు సూచనలు

సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.30 గంటల సమయానికి పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు వెళితే హడావుడిగా ఉండి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవచ్చు.

– విద్యార్థులు హాల్ టికెట్, రైటింగ్‌ప్యాడ్, అవసరమైన పెన్నులు, ఎరాయిజర్,పెన్సిల్ తీసుకెళ్లాలి.

— విద్యార్థులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చుకోవాలి

—- ప్రశ్నపత్రంపై విద్యార్థి తన హాల్‌టికెట్ నెంబర్ రాయాలి.

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు.

అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి ఉండదు.

—- -www.dse.telangana.gov.in వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు.