Reading Time: < 1 minute

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ ఎస్‌టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఖదీర్ నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. భువనగిరి పట్టణంలో ఉన్న ఆయన ఇంటిపై గురువారం ఆకస్మికంగా దాడులు చేసి పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించారు. ఎసిబి అధికారులు ఏకకాలంలో మోత్కూరులోని ఎస్టీఓ కార్యాలయంలో, భువనగిరి పట్టణంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు.