
ముంబై: ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ భారత్‌కి దక్కింది. ఈ టర్నెంట్ ఒకొక్క మ్యాచ్‌లో ఒకో ఆటగాడు హీరోగా నిలిచి భారత్‌కు విజయానికి బాటలు వేశారు. అందులో శివమ్ దూబె ఒకరడు. కీలకమైన సమయాల్లో జట్టుకు దూబె అండగా నిలిచాడు. అయితే ప్రపంచకప్ గెలిచిన తర్వాత దూబే తన ఇంటకి వెళ్లాడు. ప్రపంచకప్ గెలిచిక జట్టు సభ్యులకు ఇచ్చిన మెడల్‌ని తన తండ్రి మెడలో వేశాడు. దీంతో ఆ తండ్రి పట్టరాని ఆనందంతో మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోను దూబే సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. తన తండ్రే తనకు రియల్ హీరో అని దూబే రాసుకొచ్చాడు. నెటిజన్లు ఈ పోస్ట్‌పై లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్లలో దేబెను అభినందిస్తున్నారు.