Reading Time: < 1 minute

ఢిల్లీ:  ప్రతి పార్లమెంట్ సభ్యుడు లక్షలాది మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభా నియమాలకు కట్టుబడే అందరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు. బుధవారం అవిశ్వాసం వీగడంతో లోక్ సభ కు స్పీకర్ ఓం బిర్లా రావడం జరిగింది. అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకు పైగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోక్ సభలో ఓం బిర్లా ప్రసంగించారు. పార్లమెంట్ 140 కోట్ల భారత ప్రజల ప్రతిబింబం అని.. నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే సభ నడిపిస్తున్నామని తెలియజేశారు. ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నామనేది అవాస్తవం అని అన్నారు. విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.