Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2026 తొలి విడత షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు ఒక మ్యాచ్‌ను మాత్రమే కేటాయించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇతర నగరాలకు రెండేసి మ్యాచ్‌లను కేటాయించిన నిర్వాహకులు హైదరాబాద్‌కు మాత్రం ఒక మ్యాచ్‌తోనే సరిపెట్టారు. ఏప్రిల్ 5న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లక్నోతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ క్రికెట్‌లో రాజుకున్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.