
భోపాల్: కుతూరు లవర్ కు కరెంట్ షాక్ ఇచ్చి అనంతరం గొడలితో కాలు నరికేసి.. కరెంట్ షాక్‌తో చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించి చివరలో దొరికిపోయారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొఖ్రా అనే గ్రామానికి చెందిన పూజా అనే యువతిని సందేప్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పూజాకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయం చేయడంతో తనని పెళ్లి చేసుకోవాలని ఆమెను సందీప్ బలవంతం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు పూజా చెప్పడంతో వారు ప్లాన్ చేశారు. ఫ్లాన్ భాగంగా సందీప్ కు కూతురుతో ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు. ప్రియుడి యువతి ఇంటికి రాగానే పూజా కుటుంబ సభ్యులు అతడిని పట్టుకొని కర్రలతో దాడి చేశారు. అనంతరం కరెంట్ షాక్ ఇచ్చి గ్రామ శివారులో అతడిని పడేశారు. తీవ్రంగా గాయపడిన అతడి కాలును గొడ్డలితో నరికి దుస్తులు తగలబెట్టారు. జంతువులు రాకుండా ఉండేందుకు కట్టిన కరెంట్ వైర్ల వద్ద అతడిని పడేశారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. స్థానికులు అతడిని గమనించి వెంటనే బైధాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నలుగురు నిందితులు భోలానాత్ పనికా(29), మెలాసాగర్ పనికా(19), పూజా పనికా(20), మున్ని దేవి పనికా(40)లు నిజాలు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.