Reading Time: < 1 minute

డెహ్రాడూన్: సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుమార్తెను ప్రియుడు హత్య చేసి పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ ప్రాంతంలో జరిగింది. కోట్వాలి ప్రాంతంలో నేపాల్ కు చెందిన దీపక్ బహదూర్ అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో పలుమార్లు ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సదరు మహిళతో పాటు ఆమె కుమార్తెను చంపి ప్రియుడు పారిపోయాడు. రెండు రోజుల తరువాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు. రెండు మృతదేహాలు కనిపించడంతో పాటు దుర్వాసన వస్తుంది. వెంటనే మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం రుద్రప్రయాగ్ ఆస్పత్రికి తరలించారు. దీపక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీలోని దీపక్ తలదాచుకున్నాడని పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ముంబయికి వెళ్తున్న  ట్రైన్‌లో అతడిని పోలీసులు పట్టుకున్నారు. వెంటనే నిజాలు ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.