
ఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసు.. స్పష్టమైన అవినీతి కేసుగా ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా ఆరోపించారు.ఈ మెయిల్స్, వాట్సప్ చాట్స్ లో కీలక ఆధారాలు లభించాయని, వాట్సప్ చాట్స్ విధానపరమైన మార్పులకు ప్రయత్నం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అని.. మొత్తం విధానం సమూలంగా మార్చేందుకు లంచాలు ఇచ్చారని, మాజీ ఎమ్మెల్సీ కవిత సహాయకుడు గోరంట్ల బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని విమర్శించారు. డబ్బు సేకరణ వివరాలకు సంబంధించి సాక్షులు వివరాలు నమోదు చేస్తామని, శాస్త్రీయ దర్యాప్తుతోనే కుట్రను సిబిఐ బయటపెట్టందని అన్నారు. లంచం ఎలా ఇచ్చారో.. సాక్షులు తమ వాగ్మూలం ఇచ్చారని, కీలకపాత్రదారుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ మరొకరు అని తుషార్ మెహతా పేర్కొన్నారు.
రూ. 19 కోట్ల నుంచి రూ.100 కోట్ల లంచం ఇచ్చారని, రూ.44.5 కోట్లు.. హవాలా ద్వారా బదిలీ జరిగాయని దర్యాప్తులో తేలిందని అన్నారు. గోవా ఎన్నికల కోసం డబ్బులు వినియోగించారని, ట్రయల్ జరగకుండానే నిర్దోషులుగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వేగవంతమైన న్యాయం తప్పుగా మారిందని, డిశ్చార్జ్ దశలో ఆధారాల పరిశీలన అవసరం లేదు అని సూచించారు. సాక్షాలను పూర్తిగా పట్టించుకోకుండా తీర్పు వెలువరించిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దినేశ్ అరోరా కీలక అప్రూవర్ గా మారి.. తన వాంగ్మూలంలో అంతా చెప్పారని అన్నారు. వాట్సప్ లోనే మద్యం విధానం మార్పులపై చర్చలు జరిగాయని, మొత్తం కేసులో బుచ్చిబాబు వాట్సప్ కీలక ఆధారంగా ఉన్నాయని తుషార్ మెహతా స్పష్టం చేశారు.