Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్-2026 భారత్ సొంతమైంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించి.. టి-20 ప్రపంచకప్‌ను మూడో సారి ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో 5 మ్యాచుల్లో 321 పరుగులు చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

భారత్ మూడో సారి టి-20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలవడంతో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఫ్యాన్స్ గోలతో స్టేడియం మారుమోగి పోయింది. బాణసంచాల ధగధగలతో స్టేడియం వెలిగిపోయింది. ఇక భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసిసి ఛైర్మన్ జై షా నుంచి ట్రోఫీ అందుకోగానే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌కి వెళ్లిపోయాయి. స్టేడయంలో సెలబ్రేషన్స్ ఒకెత్తైతే.. బయట రోడ్లపై ఫ్యాన్స్ చేసుకున్న సంబరాలు మరో ఎత్తు. రోడ్లపై బాణా సంచా కాలుస్తు.. కేరింతలు కొడుతు సంబరాలు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. హార్థిక్ పాండ్యాకు చెందిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ట్రోఫీ అందుకున్నాక స్టేజ్‌ మీద అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే.. హార్థిక్ మాత్రం స్టేజ్ వెనక తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మ‌తో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. వీరిద్దరు కలిసి స్టేజ్ వెనుక ముచ్చటలు అడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసి ఫ్యాన్స్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.