
రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత శనివారం చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి హైదరాబాద్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (109) సెంచరీతో చెలరేగాడు. అభిరత్ రెడ్డి(71) అర్థ శతకంతో మెరిశాడు మిగితా బ్యాటర్లు విఫలమయ్యారు. లక్ష్య చేధనలో చంఢీగఢ్ 37.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. సన్యాం సైనీ (46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మనన్ వోహ్రా(24), విష్ణు కశ్యప్(27) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలింగ్‌లో చింతల రక్షణ రెడ్డి 3, చామ మిలింత్, కన్నాల నితీశ్ రెడ్డి చెరి రెండు, మహ్మద్ సిరాజ్, అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు ఆంధ్ర జట్టులో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేయగా.. ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసి కేవలం 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆంధ్రకి ఇది హ్యాట్రిక్ ఓటమి.