
హైదరాబాద్: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలే గ్రాండ్ సక్సెస్ సాధిస్తున్నాయి. కంటెంట్ మంచిగా ఉంటే సినిమాను సూపర్ హిట్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ దశలో మంచి పల్లెటూరి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. ‘మేమ్ ఫేమస్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న సుమంత్ త్వరలో ‘గోదారి గట్టుపైన’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తీసి పేరు తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో సినిమా దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు కానీ, తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న మంచి లవ్‌స్టోరీతో పాటు కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. హీరో, ఫ్రెండ్స్‌తో కలిసి చేసే కామెడీ మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటిస్తుండగా… సుదర్శన్, రాజ్ కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బహుశ ఈ సినిమా ఈ వేసవిలో థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.