
నంద్యాల పట్టణంలోని మూలసాగరం ప్రాంతంలో శనివారం ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక ఇంటి సమీపంలో రెండు భారీ నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. ఆ పాములు ఒకదానినొకటి పెవేసుకొని సయ్యాటలో మునిగిపోయాయి. అలవాటుగా పెరట్లోకి వచ్చిన ఇంటి యజమాని అక్కడి దృశ్యం చూసి భయంతో పరుగులు తీశాడు. విషయం తెలిసిన స్థానికులు కూడా అక్కడికి చేరుకొని పడగ విప్పి ఒకదానికొకటి పెనవేసుకుంటూ సాగిన నాగుపాముల సయ్యాటను చూసి కాలనీ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నాడు. ఎంతో అప్రమత్తంగా, అతి కష్టంపై రెండు నాగుపాములను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం వాటిని జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. రెండు నాగుపాములు అడవిలో వదిలేయడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే వాటిని చంపేందుకు ప్రయత్నించకుండా వెంటనే స్నేక్ క్యాచర్లకు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రజాక్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేజీఎఫ్ కాదు బాస్.. అంతకు మించి.. మేడిన్ ఆంధ్ర గోల్డ్ వచ్చేసింది!
వందే భారత్ ఏసీ కోచ్ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్‌తో లుక్ అదిరిందిగా!