Reading Time: < 1 minute

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం.. పైలట్ శిక్షణలో హనుమకొండ యువకుడు మృతి

Caption of Image.

దక్షిణాఫ్రికాలో జరిగిన విమాన ప్రమాదంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం కేంద్రానికి చెందిన యువకుడు ఆడెపు సుమంత్ మృతి చెందాడు. హసన్‌పర్తి  మండలం సీతం పేట  గ్రామానికి  చెందిన ఆడెపు చంద్రమోహన్  వరలక్ష్మీ ప్రస్తుత్ హసన్ పర్తి మండల కేంద్రంలో స్ధిర పడ్డారు. వీరికి  ఇద్దరు కుమారులు   చిన్న  కుమారుడు ఆడెపు సుమంత్ (22)దక్షిణాఫ్రికాలోని జొహన్నాస్‌బర్గ్‌లో  గత సంవత్సరం పైలెట్ శిక్షణ పొందేందుకు  వెళ్ళాడు.అక్కడ పైలెట్ శిక్షణలో భాగంగా శిక్షణ విమానాన్ని నడుపుతున్న సమయంలో జూన్ 27 శనివారం  సాయంత్రం  విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమంత్ మరణించాడు.

చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలనే లక్ష్యంతో కృషి చేసిన సుమంత్, ఉన్నత శిక్షణ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని ఆకస్మిక మరణించడంతో  గ్రామంలో  తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.

సౌతాఫ్రికాలో   శిక్షణా విమానం కుప్పకూలడంతో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. దీంతో తన స్వగ్రామం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలో  అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరాయి దేశంలో ఉన్న తమ కుమారుడి మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని, తగిన సహాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వేడుకుంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.