Reading Time: < 1 minute
Bhagyashri Borse Upcoming Movies Telugu Tamil Malayalam Projects

సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి.

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన గ్లామర్, స్క్రీన్ ప్రెసెన్స్, డాన్స్‌తో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్డమ్’, రామ్ సరసన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. నిర్మాతలు, దర్శకులు ఆమెలో ఉన్న పాన్ ఇండియా ఫేస్, కెమెరా ఫ్రెండ్లీ లుక్‌ను నమ్ముతున్నారు. తాజాగా ఈ బ్యూటీ తెలుగు బోర్డర్లు దాటేసి కోలీవుడ్, మోలీవుడ్‌లోనూ జెండా పాతేస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘సియాన్’లో శివకార్తికేయన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘L367’ చిత్రం ద్వారా మలయాళంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.