Reading Time: 2 minutes

పిల్లల స్నాక్స్ : అయ్యంగార్ శాండ్ విచ్, అటుకుల పకోడా, ఉల్లిపాయ రోల్స్.. పిల్లలకు ఇంట్లోనే తయారు చేసుకోండి..!

Caption of Image.

వర్షం పడేటప్పుడు కూల్ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ కరకరలాడే హాట్ హాట్ స్నాక్స్ తింటుంటే ఆహా ! ఆ ఫీల్ వేరే లెవెల్. ఈ మాన్ సూన్ ని సూపర్ ఎంజాయ్ చేయడానికే ఈ వెరైటీ స్నాక్స్, పోహాలో పకోడా, కలర్ఫుల్ అండ్ టేస్టీ శాండ్విచ్, ఉల్లిగడ్డలతో చేసుకునే క్రిస్పీ రోల్స్… నోరూరించే ఈ స్నాక్స్ ను చిటికెలో చేసుకోవచ్చు.

పోహా పకోడా
కావాల్సినవి:
అటుకులు : పావు కప్పు
ఉడికించిన ఆలుగడ్డలు : అరకప్పు
కొత్తిమీర : రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు : ఒక టీ స్పూన్స్
కారం : ఒక టీ స్పూన్
చక్కెర : అర టీ స్పూన్
నిమ్మరసం: అర టీ స్పూన్
జీలకర్ర : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : వేగించడానికి సరిపడా

తయారీ:
అటుకులను బాగా కడిగి, వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి.  కాస్త తడారాక, ఉడికించిన ఆలుగడ్డలు మెదిపి అందులో వేయాలి. తర్వాత కొత్తి మీర, పచ్చిమిర్చి తరుగు, కారం, చక్కెర, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి. కడాయిలో సరిపడా నూనె వేడి చేసి ఉండల్ని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. ఈ పోహా పకోడాల ను గ్రీన్ చట్నీ, టొమాటో కెచెప్లతో తినొచ్చు.

 
అయ్యంగార్ శాండ్విచ్

కావాల్సినవి:
బ్రెడ్ స్లైస్ లు : నాలుగు
నూనె : ఒక టేబుల్ స్పూన్
ఆవాలు, జీలకర్ర : అర టీ స్పూన్
ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు
పసుపు : పావు టీ స్పూన్
టొమాటో ముక్కలు: ఒక కప్పు
క్యారెట్ తరుగు : అర కప్పు
క్యాబేజీ, క్యాప్సికం : ఒక్కో కప్పు
పచ్చిమిర్చి తరుగు : కొద్దిగా
గరం మసాలా : అర టీ స్పూన్
కొత్తిమీర తరుగు : అర కప్పు
నిమ్మరసం : అర టీ స్పూన్
కారం, ఉప్పు : సరిపడా
వెన్న : ఒక టీ స్పూన్

తయారీ:
పాన్ లో  నూనె వేడి చేసి.. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. పసుపు, తర్వాత టొమాటో, క్యాప్సికం,పచ్చిమిర్చి, క్యారెట్ తరుగు కాస్త ఉడికిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగును  వేయాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలపాలి. పెనం మీద వెన్న వేడి చేసి బ్రెడ్ స్లైస్ లను దోరగా వేగించాలి. వాటిని ఒక ప్లేట్ లో  పెట్టి, ఒక బ్రెడ్ స్లైస్ మీద ముందుగ రెడీ చేసిన స్టఫ్ ని పెట్టాలి. దానిమీద మరో బ్రెడ్ స్లైస్ ని  పెట్టి శాండ్విచ్ షేప్ లో కట్ చేయాలి. దీన్ని పెరుగుతో తినొచ్చు. 

►ALSO READ | Health : ఆకలి వేస్తుందా.. ఆకలి అనిపిస్తుందా..? రెండింటికీ తేడా ఏంటీ.. గుర్తించటం ఎలా..?

క్రిస్పీ ఆనియన్ రోల్స్

కావాల్సినవి: మైదా పిండి : ఒక కప్పు
ఉప్పు : సరిపడా, 
నీళ్లు: ఒకటిన్నర కప్పు,
ఉల్లిగడ్డ తరుగు, అటుకులు: ఒక్కోటి అర కప్పు
కొత్తిమీర తరుగు : రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: రెండు, 
కారం, ధనియాల పొడి, గరం మసాలా : ఒక్కోటి అర టీ స్పూన్
నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
నూనె: వేగించుకునేందుకు సరిపడా

తయారీ:
జార్లో మైదా పిండి, ఉప్పు, నూనె, నీళ్లు వేసి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ ముక్కలు, అటుకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం వేసి కలపాలి.

ఒక పాన్ను ఆయిల్ టిష్యూతో తుడిచి బాగా వేడిచేయాలి. తర్వాత పిండిని పలుచగా దోశలా వేసి నిమిషం పాటు కాలిస్తే సమోసా షీట్ వస్తుంది. ఆ షీట్లు ఒకదానికొకటి అతుక్కోకుండా నెయ్యిపూసి పెట్టాలి. ఒక గిన్నెలో కొద్దిగా మైదా నీళ్లు పోసి పేస్ట్ లా చేయాలి. తర్వాత ముందుగా చేసుకున్న షీట్లలో ఉల్లిగడ్డ మిక్చర్ని పెట్టి రోల్ చేయాలి. చివర్లో బైండింగ్ కోసం మైదాను పూసి రోలు పూర్తిగా క్లోజ్ చేయాలి. తర్వాత ఒక కడాయిలో నూనె మరిగించి ఉల్లిగడ్డ రోల్స్ ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు వేగిస్తే క్రిస్పీ ఆనియన్ రోల్స్ రెడీ. వీటిని టొమాటో కెచెప్ తో తింటే సూపర్ గా ఉంటాయి.

©️ VIL Media Pvt Ltd.