ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) గురించి ఉద్యోగుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి పీఎఫ్ సౌకర్యం ద్వారా కేంద్రం అనేక ప్రయోజనాలు అందిస్తోంది. పెన్షన్ సదుపాయంతో పాటు జీవిత బీమా, పీఎఫ్ పొదుపు సొమ్ముపై వడ్డీ లాంటి బెనిఫిట్స్ కల్పి్స్తోంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్ధిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఉద్యోగి, యజమాని ఇద్దరి నుండి సమాన వాటాను సేకరించి వడ్డీని అందిస్తోంది. త్వరలో ఈపీఎఫ్‌వో 3.0ను కేంద్ర ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా అనేక రూల్స్ ప్రవేశపెట్టనుండగా.. ఇందులో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 100 శాతం సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ త్వరలో ఇందుకు కొత్త రూల్స్ రానున్నాయి.
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఉద్యోగంలో ఉన్నప్పుడు పూర్తి విత్‌డ్రాయల్స్‌కు అనుమతి లేదు. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే 100 శాతం సొమ్మును విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మొత్తం నిధులు తీసుకోవచ్చు. ఉద్యోగం మానేసి రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన ఒక నెలలోపు తన పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25 శాతం కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. నిరుద్యోగ సమయంలో ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఇర EPFO పాక్షిక ఉపసంహరణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు కొంత మొత్తాన్ని వివిధ కారణాలతో విత్ డ్రా చేసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహం, గృహ కొనుగోలు, గృహ నిర్మాణం, గృహ రుణ చెల్లింపు, వైద్య చికిత్స వంటి ప్రయోజనాల కోసం వారి PF ఖాతా నుండి ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఉపసంహరించుకోవచ్చు.
అయితే నిధుల తక్షణ అవసరం లేకపోతే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే బదులు PF బ్యాలెన్స్‌ను ఖాతాలోనే ఉంచడం మంచిది. ఇది భవిష్యత్తు ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు పదవీ విరమణ సమయంలో తగినంత నిధులు అందుబాటులో ఉండేలా చూస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే విత్ డ్రా చేసుకుంటే మంచిది.




