Reading Time: < 1 minute

జిమ్కు వెళ్లొచ్చే లేడీసే టార్గెట్.. పరిచయం పెంచుకుని పెళ్లి దాకా.. నిత్య పెళ్లి కొడుకు మూడు పెళ్లిళ్ల ముచ్చట !

Caption of Image.

జిమ్ కు వచ్చే మహిళలే అతని టార్గెట్. పరిచయం చేసుకుని.. మంచి వాడిగా నటిస్తూ.. భరోసా ఇచ్చి.. పెళ్లి చేసుకోవడం.. మోసం చేసి వదిలేయడం.. మళ్లీ పెళ్లి చేసుకోవడం. ఇది ఈ నిత్య పెళ్లికొడుకు యవ్వారం. హైదరాబాద్ లోని అల్వాల్ లో మహిళ, ఆమె మైనర్ కూతురిపై లైంగిక ఆరోపణల కేసులో ఈ మోసగాడిపై పోక్సో కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. 

నిత్య పెళ్లి కొడుకు రవి కుమార్ అలియాస్ రఫీపై ఫోక్సో నమోదు చేశారు పోలీసులు.  2025 ఆగస్టు 28 లోనే ఈ నిత్యపెళ్లికొడుకుపై కేసు నమోదయింది. నిందితునితో పాటు కొంత మంది ముఠా  జిమ్ లో పరిచేయమైన మహిళను వేధిస్తున్నారు. మహిళ కారులో లైవ్ ట్రాకింగ్ డివైస్ లు, సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

రవి అలియాస్ రఫీ తో పాటు రూపేష్ రాజ్ అనే మరో వ్యక్తి కలిసి మహిళతో పాటు ఆమె మైనర్ కూతురును వేధింపులకు గురిచేసినట్లు మహిళ అప్పట్లో ఫిర్యాదు ఇచ్చింది.  

►ALSO READ | ఇంటి ఫుడ్ తీసుకెళ్లే వారికి రైల్వే అధికారులు షాక్.. ఒక్క రోజులోనే 1450 కేసులు.. రూ.3 లక్షల జరిమానా..!

అయితే మల్కాజ్గిరి కమిషనర్ గా సుమతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసును రీ ఓపెన్ చేసి విచారణకు ఆదేశించారు.  బాధితురాలు కూతురును వేధింపులకు గురి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడంతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.A1 రూపేష్ రాజ్, A2 రవి కుమార్ అలియాస్ రఫీ లను ఈ కేసులో చేర్చారు. 

రవికుమార్ అలియాస్ రఫీ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా జిమ్ కు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వేధింపులకు గురి చేసినట్లు విచారణలో వెల్లడయిందని పోలీసులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.