టమాటా ఆవకాయకు కావాల్సిన పదార్దాలు: అరకిలో టమోటాలు, మెంతి గింజలు, రుచికి సరిపడా ఉప్పు, 50 గ్రాముల చింతపండు , పావు టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ ఎర్ర కారం పొడిను తీసుకోవాలి. మసాలా కోసం
ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా ఇంగువ , నాలుగు ఎర్ర మిరపకాయలను తీసుకోవాలి.
టమాటా ఆవకాయ తయారి విధానం: ముందుగా మీరు పండిన టమాటాలను తీసుకుని వాటిని బాగా కడిగి, ఫ్యాన్ కింద ఆరబెట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇదే గిన్నెలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి 5 నుంచి 6 గంటల పాటు వీటిని పక్కన ఉంచాలి. ఇలా చేస్తే ముక్కలు కొంచం గట్టిగా అవుతాయి
టమాటా ఆవకాయ తయారి విధానం స్టెప్ 1 : ఆ తర్వాత వీటి నుంచి వచ్చిన నీటిని కూడా వేరు చేసి టమాటా ముక్కలను కొద్దిసేపు ఆరబెట్టాలి. ఇక ఇప్పుడు కొద్దిగా ఆవాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసి బాగా కలపాలి. ఈ పొడి పచ్చడి చెడిపోకుండా, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతుంది.
టమాటా ఆవకాయ తయారి విధానం స్టెప్ 2 : ఇంకా ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి చేతితో అన్ని కలిసేలా చేయాలి. ఇక ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా నువ్వుల నూనె చేసి , అది బాగా వేడయ్యాక దీనిని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన నూనెలో టమాటా ఆవకాయ వేసి మిక్స్ అయ్యేలా దీనిని మంచిగా కలపాలి. వేయించిన ఆవాలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు కూడా పచ్చడిలో కలపాలి.
పచ్చడి మొత్తం అయిపోయాక పొడిగా ఉన్న గాజు సీసాలో పెట్టి రెండు, మూడు రోజులకొకసారి తిప్పుకోవాలి .మీరు ఈ పచ్చడిలో నూనె వేయరు కాబట్టి మంచిగా అందరూ తినొచ్చు. ఇంకా ఇది టిఫిన్స్ లోకి కూడా అదిరిపోతోంది. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి దీనిని తినండి. మూడో రోజు నుంచి వేడి అన్నంలో తినొచ్చు .




