Reading Time: < 1 minute
Karuppu Blockbuster Success Suriya Is Set To Sing A Song In His Next Movie

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరుప్పు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు తన అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తన నెక్ట్స్ మూవీ కోసం సూర్య మైక్ పట్టుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ కోసం సూర్య ఒక అదిరిపోయే డాన్స్ నంబర్‌ను పాడారు.

ఈ స్పెషల్ డాన్స్ నంబర్‌ను ఇటీవల వచ్చిన యూత్ సినిమా యాక్టర్ కమ్ డైరెక్టర్ కెన్ కరుణాస్ స్వయంగా రచించడం విశేషం. సూర్య మార్క్ ఎనర్జీకి తోడు, కెన్ కరుణాస్ అందించిన క్యాచీ లిరిక్స్, వెంకీ అట్లూరి మేకింగ్ స్టైల్ కలసి ఈ పాటను ఆల్బమ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. సాధారణంగానే సూర్య డాన్స్ నంబర్లకు థియేటర్లలో రెస్పాన్స్ భారీగా ఉంటుంది అలాంటిది ఈ పాటను స్వయంగా సూర్య పాడటంతో ఏ రేంజ్ లో వుండబోతుందోనని ఎదురుచూస్తున్నారు. సూర్య వాయిస్‌లో రాబోతున్న ఈ మాస్ డాన్స్ నంబర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస సక్సెస్‌ల తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.