Reading Time: < 1 minute
Viral Video: చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ హెల్మెట్ ప్రాణరక్షక కవచం.. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా దాన్ని పెడచెవును పెడతారు.కానీ హెల్మెట్ లేకపోవడం ఎత ప్రమాదమో ఇటీవల బెంగుళూరులోని రాజాజీనగర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మరోసారి గుర్తు చేసింది. క్షణాల్లో జరిగిన ప్రమాదం ఎంతటి విషాదానికి దారి తీస్తుందో చూపించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా సడెన్‌గా దారి పక్కన ఉన్న చెట్టు నుంచి ఓ కొమ్మ విరిగి అతని తలపై పడిపోయింది. అంతే అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతను కోమాలోకి వెళ్లినట్టు నిర్ధారించారు.

కాబట్టి బైక్ డ్రైవింగ్ చేసేప్పుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. నాణ్యమైన ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌ను సరిగా ధరించడం వల్ల తలకు తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. చిన్న దూరమైనా, పెద్ద ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఒక నిమిషం నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగిల్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే… హెల్మెట్ అనేది పోలీసుల జరిమానా నుంచి తప్పించుకునేందుకు కాదు.. మీ కుటుంబం కోసం మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి. మీ కోసం ఎదురుచూస్తున్న వారి ఆనందాన్ని కాపాడటానికి. కాబట్టి ప్రతి ప్రయాణంలో హెల్మెట్‌ను అలవాటుగా మార్చుకుంటేనే ప్రమాదాల తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.