
హైదరాబాద్‌లో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. జూలై 1వ తేదీన నగరంలో ఒక భారీ మెగా జాబ్ మేళా జరగబోతోంది. కనీసం టెన్త్ క్లాస్ (SSC) పాస్ అయిన అభ్యర్థుల నుంచి ఆపై చదువులు చదివిన వారెవరైనా సరే… ఈ జాబ్ మేళాకు నేరుగా హాజరు కావచ్చు. ఐటీ (IT), హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ లాంటి మరెన్నో ప్రముఖ రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఫేర్‌లో పాల్గొంటున్నాయి. అంతేకాదు, కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఆప్షన్స్ కూడా ఇస్తున్నాయి.
వివరాలు
- జూలై 1, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు.
- కింగ్స్ ప్యాలెస్, మెహదీపట్నం (పిల్లర్ నంబర్ 67 దగ్గర, PVNR ఎక్స్‌ప్రెస్‌వే).
- ఈ జాబ్ మేళాకు ఎంట్రీ పూర్తిగా ఉచితం
ఇక్కడే మీకు నేరుగా స్పాట్ ఇంటర్వ్యూలు (Spot Interviews) జరిపి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం 83743 15052 నంబర్‌ను సంప్రదించవచ్చు.