Reading Time: 2 minutes

గంభీర్ మావా నీ కోచింగ్లో ఇంకెన్ని ఘోరాలు చూడాలి?.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

Caption of Image.

Gautam Gambhir: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన జోష్‌లో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే పసికూన ఐర్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు సమష్టిగా రాణించి 34 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే టీమిండియాపై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

వరల్డ్ కప్ గెలిచిన ప్రతిసారీ ఇదే కథ: 
ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌తో ఆడిన 8 టీ20లు, 3 వన్డేల్లో ఐర్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కానీ తాజా విజయంతో ఆ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయాల తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌ల్లోనే ఓడిపోయే జట్టుగా టీమిండియా ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయం సాధించిన తర్వాత కూడా, ఆడిన తొలి మ్యాచ్‌లోనే జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది.

గంభీర్‌పై విమర్శల వర్షం: 
ఈ ఘోర పరాజయంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. గంభీర్ పర్యవేక్షణలో తాము ఇంకెన్ని ఘోరాలు చూడాలోనని కామెంట్లు పెడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మాట నిజమే అయినప్పటికీ.. అదే టైంలో భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని అత్యంత ఘోరమైన పరాజయాలను కూడా మూటగట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు.

గంభీర్ కోచింగ్‌లో చెత్త రికార్డులు:
గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి భారత జట్టు ఎదుర్కొన్న పరాజయాల లిస్ట్ ఇదే: 

* 27 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై టీమిండియా తొలిసారి వన్డే సిరీస్ కోల్పోయిన జట్టుగా అప్రతిష్టని మూటగట్టుకుంది.
* భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్ట్‌ల సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యింది. 
* 19 ఏళ్ల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఇండియా టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. 
* 10 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు చేజార్చుకుంది. 
* 17 ఏళ్ల తర్వాత అడిలైడ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా ఇండియన్ టీమ్ ఓడింది.
* 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ని భారత్ కోల్పోయింది. 
* 15 ఏళ్ల తర్వాత హోమ్ గ్రౌండ్‌లో సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా. 
* భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోవడం.
* అంతర్జాతీయ టీ20ల్లో పసికూన ఐర్లాండ్ చేతిలో తొలిసారి భారత జట్టు ఓటమిని చవిచూసింది. 
 

©️ VIL Media Pvt Ltd.