
తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత వరల్డ్ ఛాంపియన్స్‌గా ఆడిన తొలి సిరీస్‌లో, అది కూడా ఐర్లాండ్ వంటి పసికూన టీమ్‌తో ఆడి దారుణంగా రెండుకు రెండు మ్యాచ్‌లు ఓడిపోయారు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా యంగ్ ప్లేయర్, వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీని రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆడించకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని, అతన్ని ఎందుకు ఆడించలేదని కూడా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డస్కటే మీడియాతో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ నిజంగా అద్భుతమైన ప్లేయర్ అని చెబుతూనే.. అతన్ని ఆడించేందుకు తాము సంజూ శాంసన్‌ను పక్కనపెట్టలేమని అన్నారు.
సంజూ శాంసన్ మూడు నెలల క్రితమే తమకు టీ20 వరల్డ్ కప్ అందించాడని, అలాంటి బ్యాటర్‌ను ఎలా పక్కనపెట్టాలంటూ ప్రశ్నించారు. సో.. వైభవ్ కోసం సంజూ అన్యాయం చేయలేమనే విధంగా టెన్ డస్కటే మాట్లాడారు. అయితే సంజూ శాంసన్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. తొలి మ్యాచ్‌లో 5 పరుగులు బౌల్డ్ అయిన శాంసన్, రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయినా కూడా ఇప్పటికీ టీమిండియా కోచింగ్ స్టాఫ్ అతన్నే వెనకేసుకోస్తున్నారని మరోవైపు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి