Reading Time: 2 minutes

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. ఐర్లాండ్‌కు ముందుగా బ్యాటింగ్

Caption of Image.

India vs Ireland: బెల్ఫాస్ట్: భారత్ వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే రెండో టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. బెల్ఫాస్ట్‌లోని స్టోర్‌మాంట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ కీలక పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ ఆటగాళ్లు సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్‌లు ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.  

 భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్‌లో ఓటమితో భారత జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. సూర్యాంశ్ షెడ్గే విధ్వంసకర బ్యాటర్.. డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, ఇండియా-ఎ పర్యటనల్లో నిలకడగా రన్స్ సాధించి జట్టులోకి వచ్చాడు. ఇక పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు ఇది మొదటి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో అతనిపై ఎలాంటి ఒత్తిడి పెట్టదలుచుకోలేదు.. గత మ్యాచ్‌ను అతను నిశితంగా గమనించాడు కాబట్టి, ఇక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడతాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ మాట్లాడుతూ.. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ, పవర్‌ప్లేలో తమ జట్టు 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంపై ఫోకస్ పెట్టాం.. గత మ్యాచ్‌లో భారత బౌలర్లు పిచ్‌పై హార్డ్ లెంత్‌లను అద్భుతంగా ఉపయోగించుకుని సక్సెస్ అయ్యారు. ఈసారి మేము పిచ్ స్వభావాన్ని వీలైనంత త్వరగా అంచనా వేసి, వారి వ్యూహాలను తిప్పికొట్టాల్సి ఉంది.. తొలి మ్యాచ్ తప్పుల నుంచి నేర్చుకుని ఈరోజు పవర్‌ప్లేలో మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నామని టక్కర్ తెలిపాడు.

►ALSO READ | రొనాల్డో బైసికిల్ కిక్ మామూలుగా లేదుగా.. డిఫెండర్‌కు గట్టిగా తాకిన షాట్ వైరల్!

జట్లు:
ఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్/ కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్

©️ VIL Media Pvt Ltd.