Reading Time: < 1 minute

ఇంధన ధరలు ఎందుకు తగ్గించట్లేదు?..కేంద్రాన్ని నిలదీసిన మల్లికార్జున ఖర్గే

Caption of Image.

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి తగ్గినప్పటికీ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించట్లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటోందని, వారి జేబులకు చిల్లు పెడుతోందని ఆరోపించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

‘మోదీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవడానికి ప్రజలను ఒక సాధనంగా వాడుకుంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రంగా ఉన్న సమయంలో బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 138 డాలర్లుగా ఉండేది. ఆ టైం లో దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77, డీజిల్ రూ. 87.67 గా ఉండేది. మరిప్పుడు క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 70.71 డాలర్లకు పడిపోయింది. ముడిచమురు ధరలు తగ్గినప్పుడు.. దేశంలో పెట్రోల్ ధరను రూ.102, డీజిల్​ను రూ. 95 కి (ఢిల్లీ ధర) ఎందుకు విక్రయిస్తున్నారు?’ అని ఖర్గే ప్రశ్నించారు.

 

©️ VIL Media Pvt Ltd.