
ప్రముఖ కన్నడ హీరోయిన్ షర్మిలా మాండ్రే శుభవార్త చెప్పింది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది.తాజాగా షర్మిలా మాండ్రే, ప్రముఖ తమిళ నిర్మాత సుధన్ సుందరంతో నిశ్చితార్థం చేసుకుంది. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తన శుభకార్యానికి సందర్భానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా షర్మిలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. షర్మిలా మాండ్రే- సుధన్ సుందరం గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఒక హింట్ ఇచ్చిందీ అందాల తార. ఇప్పుడు ఆ రూమర్లను నిజం చేస్తూ తన ప్రియుడితో కలిసి ఉంగరాలు మార్చుకుందీ ముద్దుగుమ్మ. త్వరలోనే వీరు పెళ్లిచేసుకోనున్నట్లు సమాచారం.
కన్నడ హీరోయిన్ అయిన షర్మిలా మండ్రే దక్షిణాది భాషలన్నింటీలోనూ నటించింది. అయితే తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేసింది. 2013లో అల్లరి నరేశ్ హీరోగా చేసిన ‘కెవ్వు కేక’ మూవీలో హీరోయిన్ గా నటించింది షర్మిల. కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ పలు హిట్ సినిమాలు నిర్మించిందీ అందాల తార. ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది షర్మిల.
షర్మిలా మాండ్రే-సుధాన్ సుందరం ల ఎంగేజ్మెంట్ ఫొటోస్.,.
ఇక షర్మిలకు కాబోయే భర్త విషయానికి వస్తే..సుధాన్ సుందరం తమిళంలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నాడు. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ మూవీ ‘మహారాజా’ నిర్మించింది ఈయనే. కాగా ఇప్పటికే షర్మిలా మాండ్రే వివాహానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాహ వేదిక, తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని యోచిస్తున్నారని టాక్.
షర్మిలా మాండ్రే మరిన్ని ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.