
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్, సనత్‌నగర్) టెక్నీషియన్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 122 .
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నికల్ పోస్టులు 98,
అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు: 24.
ఎలిజిబిలిటీ
టెక్నీషియన్ పోస్టులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు 750 లేదా అంతకంటే ఎక్కువ పడకల సామర్థ్యం ఉన్న హాస్పిటల్లో ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి.
అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, బీసీఏ, సీఏ పూర్తిచేసి ఉండాలి. ఏడాది నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: టెక్నికల్ పోస్టులకు 35 ఏళ్లు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 45 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 22.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగతా అభ్యర్థులకు రూ.1000.
లాస్ట్ డేట్: జులై 6.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nims.edu.inను సందర్శించండి.