
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఐకానిక్ లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాపై విరుచుకుపడింది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు చేసింది.
ఓపెనర్ల అదిరిపోయే స్టార్ట్:
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆసీస్ బౌలర్లను ఆరంభం నుంచే టార్గెట్ చేస్తూ ఈ జంట మొదటి వికెట్‌కు 66 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారీ షాట్ ఆడిన షఫాలీ వర్మ (34) ఔట్ కాగా, ఆ తర్వాత కాసేపటికే క్రీజులో సెట్ అయి హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న స్మృతి మంధాన.. జెమిమా రోడ్రిగ్స్‌తో జరిగిన ఒక ఘోరమైన మిక్స్-అప్ వల్ల రనౌట్ అయి హాఫ్ సెంచరీ ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. ఆనతరం జెమీమ రోడ్రిక్స్ సైతం దూకుడు ఆడుతున్న క్రమంలో రిటైర్డ్ ఔట్ గా మైదానం వీడింది.
25 బంతుల్లోనే హర్మన్ ఫిఫ్టీ:
స్మృతి అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆసీస్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కేవలం 25 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 6 పోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు ) బాదేసి జట్టుకు 170 పరుగుల భారీ టోటల్‌ను అందించింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా వంటి బలమైన టీమ్‌పై ఈ రేంజ్ స్కోర్ సాధించడం భారత్‌కు ప్లస్ పాయింట్. ఆసీస్ బౌలర్లలో సోఫీ మోలినెక్స్ మాత్రమే రెండు వికెట్లు దక్కించుకుంది.