Reading Time: 2 minutes
Idupu Kayitham Title Controversy Andhra Vs Telangana Social Media War

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఆంధ్ర వర్సెస్ తెలంగాణ’ అన్నట్టుగా ఓ పెద్ద వివాదమే నడుస్తోంది. నిజానికి ‘ఇడుపు కాయితం’ అనే పేరుతో బన్నీ వాసు నిర్మాతగా, ప్రియదర్శి హీరోగా ప్రారంభించిన సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఈ వివాదం తెరమీదకు వచ్చింది. అయితే, ఈ వివాదానికి కొద్ది రోజుల ముందు, గతంలో తెలుగు సినిమాలకు రివ్యూస్ ఇస్తూ ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన యూట్యూబర్, “తెలంగాణ అంటే భాష” అంటూ ఒక వీడియో చేశాడు. నిజానికి తెలంగాణది యాస అని చాలామంది రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ “మా తెలంగాణది యాస కాదు, భాష” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ జనసేన ఇష్యూలో అనవసరంగా తెలంగాణ వివాదాన్ని లేపిన క్రమంలో మొదలైంది. అక్కడ ఒక విశ్లేషకుడు, ఒక రాజకీయ పార్టీకి మధ్య జరిగిన వివాదాన్ని కొంతమంది తెలంగాణ వర్సెస్ ఆంధ్రగా మార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో సదరు యూట్యూబర్ కూడా ఆ వివాదంతో కంటెంట్ క్రియేట్ చేసుకుని, వ్యూస్‌తో లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా “తెలంగాణ భాష” అంటూ ఒక వీడియో చేశాడు. దాన్ని చూసిన ఒక నెటిజన్, ఈ ‘ఇడుపు కాయితం’ ఓపెనింగ్ అయిన రోజున ఆ సినిమాకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ, “ఇది తెలంగాణ భాషలో రిలీజ్ చేస్తారట కదా, తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా లేదా?” అంటూ సదరు యూట్యూబర్ చేసిన వీడియోకి కౌంటర్‌గా మాట్లాడాడు.

అయితే, అది కచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని అవమానపరిచే విధంగా ఉండడంతో, ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్ అయింది. అతను తన తప్పు తెలుసుకుని అది తొలగించే లోపు, ఈ విషయం దావాగ్నిలా వ్యాపించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. అంతేకాక, కవిత లాంటి వారు సైతం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి ముడి పెడుతూ కామెంట్స్ చేసేదాకా వెళ్ళింది. వాస్తవానికి జరుగుతున్న అంశం ద్వారా కంటెంట్ క్రియేట్ చేసుకుని, వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించే ఓ యూట్యూబర్, తన తెలంగాణ ప్రాంతపు యాసను భాషగా భావిస్తూ గొప్పతనంగా చెప్పుకున్న విషయాన్ని… మరో సోషల్ మీడియాలో పనిలేని వ్యక్తి సీరియస్గా తీసుకుని దానికి కౌంటర్ ఇస్తూ మాట్లాడిన విధానం సరిగా లేకపోవడం ఇప్పుడు రెండు ప్రాంతాల వాసుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మరి మీ ఉద్దేశం ప్రకారం ఈ వివాదానికి కారణం ఆ ఇద్దరిలో ఎవరు? ఎవరి కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది కామెంట్ చేయండి.