
ముంబైలో మరోసారి హైప్రొఫెల్ ప్రాస్టిట్యూషన్ రాకెట్ గుట్టు రట్టైంది . గిర్గావ్ ప్రాంతంలోని ఒక లగ్జరీ హోటల్ ను వేదికగా చేసుకొని సాగుతున్న ఈ చీకటి దందాను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా సినీ నటీమణులను పోలీసులు రెస్క్యూ చేయగా.. ఈ దందా నడుపుతున్న ఒక వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు.
మేకప్ ఆర్టిస్ట్ ముసుగులో బ్రోకర్..
హైప్రొఫెల్ వ్యభిచారం రాకెట్ పై పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన నిందితుడు సినీ పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. ఇండస్ట్రీలోని ప్రముఖులు, జూనియర్ ఆర్టిస్టులు, హీరోయిన్లతో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకొని ఇతడు ఈ చీకటి వ్యాపారాన్ని నడుపుతున్నాడు. సినిమా ఇండస్ట్రీలోని మరికొందరు పెద్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఫోన్ రికార్డులు, కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు.
ఆ ఇద్దరు హీరోయిన్లు వీరే..
ఈ దాడిలో రెస్క్యూ అయిన ఇద్దరు భామల్లో ఒకరు మరాఠీ చిత్రసీమలో లీడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ కాగా.. మరొకరు బెంగాలీ, హిందీ సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలు చేసిన నటిగా గుర్తించారు. అయితే వారి ప్రైవసీ, భద్రత దృష్ట్యా పోలీసులు పేర్లను గోప్యంగా ఉంచారు. వారిని నిందితులుగా కాకుండా బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్‌కు పంపించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరు ఇటువైపు వచ్చారా? లేక బెదిరింపులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | కంటెంట్ కోసం ఇంత దిగజారాలా? అంత్యక్రియలను ‘సర్కస్’ చేసేశారు.. రాధికా ఎమోషనల్ ఫైర్!
కల్యాణ్‌లోనూ ..
ఈ ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందే థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలోనూ ఇలాంటిదే మరో క్రేజీ కేసు వెలుగుచూసింది. అక్కడ ఒక మహిళా న్యాయవాది (Advocate) హోటల్ వేదికగా గత మూడు నెలలుగా వ్యభిచార గృహాన్ని నడుపుతూ పట్టుబడటం సంచలనం సృష్టించింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు కస్టమర్ల అవతారమెత్తి సివిల్ డ్రస్‌లో వెళ్లి మరీ ఆ రాకెట్‌ను బద్దలు కొట్టారు. భారతీయ న్యాయ సంహిత (BNS), ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఈ రెండు కేసులపై ముంబై పోలీసులు నెక్ట్స్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ రాకెట్ల వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది..