Reading Time: 2 minutes

ప్రీ ప్రైమరీ చదువులపై ఫోకస్.. ప్రతి నెలా రెండు రోజులు అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్

Caption of Image.
  • 18, 19 తేదీల్లో అభ్యసన సామర్థ్యాల పరిశీలన
  • లెర్నింగ్ ట్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతి చిన్నారి ప్రగతి నమోదు
  • మార్కులు, ర్యాంకులు లేవు.. కేవలం అభివృద్ధిపైనే దృష్టి
  • క్లాస్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు రకాల లెర్నింగ్ కార్నర్లు

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లోని ప్రీప్రైమరీ చిన్నారుల చదువు ఇకపై ఆటపాటలకే పరిమితం కాకుండా, వారిలో ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా విద్యాశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది. ప్రతి చిన్నారి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రతినెలా రెండు రోజులను కేటాయించింది. చిన్నారులు ఒకటో తరగతిలోకి వెళ్లేనాటికి పూర్తిస్థాయిలో పాఠశాల సంసిద్ధత సాధించాలనే లక్ష్యంతో ఈ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న గైడ్ లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కాగా అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 1,362 బడుల్లో నడుస్తున్న ఈ సెక్షన్లను, మరో 2,769 స్కూళ్లకు విస్తరిస్తున్నారు. స్కూల్ వాతావరణ భయం లేకుండా జాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ లెర్నింగ్ పద్ధతిలో ఇది ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీచర్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, స్టూడెంట్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్, లక్ష్యాల పోస్టర్లు, లెర్నింగ్ ట్రాకర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది.

ఆటపాటలతో అంచనా వేయాలి

ప్రీప్రైమరీ సెక్షన్లలో చదువుతున్న చిన్నారులకు ప్రతి నెలా 18, 19వ తేదీల్లో అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశించింది. ఇది సాధారణ పరీక్షల మాదిరిగా ఒత్తిడితో కూడుకున్నది కాదు. పిల్లలకు ఇబ్బంది కలగకుండా, వారి ఆటపాటలు, కృత్యాల ద్వారానే టీచర్లు అంచనా వేయాల్సి ఉంటుంది. టీచర్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూచించిన విధంగా పిల్లలు ఏ మేరకు పాఠాలను గ్రహిస్తున్నారనేది ఈ రెండు రోజుల్లో గమనించి రికార్డు చేస్తారు. 

ప్రతి కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓ ప్రత్యేకత

ప్రీ-ప్రైమరీ తరగతి గదులు పిల్లలను ఆకట్టుకునేలా ‘ప్రింట్ రిచ్’ (రంగురంగుల చిత్రాలు, చార్టులతో) ఉండాలని ఆదేశించారు. ప్రతి తరగతి గదిలో తప్పనిసరిగా నాలుగు రకాల ‘లెర్నింగ్ కార్నర్లు’ ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిలో రీడింగ్ కార్నర్ (కథల పుస్తకాలు, బొమ్మల కార్డులు), కాగ్నిటివ్ కార్నర్ (పజిల్స్, షేప్స్, అంకెలు గుర్తించడం), క్రియేటివ్ కార్నర్ (డ్రాయింగ్, పెయింటింగ్, బంకమట్టి ఆటలు), ప్లే కార్నర్ (ఆట వస్తువులు, పాత దుప్పట్లు, వేషధారణ సామాగ్రి) వంటివి ఉంటాయి.

లెర్నింగ్ ట్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రగతి నమోదు

ప్రతి చిన్నారి ప్రగతిని నమోదు చేసేందుకు అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ లెర్నింగ్ ట్రాకర్ పేరుతో ప్రత్యేక ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రూపొందించారు. ఇందులో భాషా పరిజ్ఞానం (తెలుగు, ఇంగ్లిష్ అక్షరాల గుర్తింపు), అంకెల పరిజ్ఞానం(1- నుంచి 9 వరకు లెక్కింపు), సామాజిక, ఉద్వేగ నైపుణ్యాలు (భావ వ్యక్తీకరణ), భౌతిక అభివృద్ధి (పరిశుభ్రత, వ్యాయామం) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లాడు సొంతంగా చేస్తున్నాడా? టీచర్ సహాయం తీసుకుంటున్నాడా? లేక ఇంకా మెరుగుపడాలా? అనే విషయాలను ఈ ట్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టిక్ చేస్తారు. ఈ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రక్రియ కేవలం టీచర్లకే పరిమితం కాకుండా.. హెడ్ మాస్టర్లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు క్రమం తప్పకుండా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ప్రతి శుక్రవారం కనీసం ఒక క్లాస్ అబ్జర్వేషన్ చేసి, ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ డైరీలో టీచర్లు ఎక్కడ మెరుగుపడాలి? పిల్లలకు ఎలా బోధించాలి? అనే దానిపై సూచనలు ఇవ్వాలి. ఎంఈఓలు, డీఈఓలు సైతం క్షేత్రస్థాయిలో ఈ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో, లేదో పర్యవేక్షించాల్సి ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.