
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రూట్ మార్చారు. ఇప్పటివరకు కేవలం తన డ్యాన్స్, యాక్టింగ్ , ఎనర్జీతో వెండితెరను షేక్ చేసిన రామ్.. ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారిపోయారు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో మెగా ఫోన్ పట్టారు. ఆయనే హీరోగా నటిస్తూ.. స్వయంగా కథ అందిస్తూ.. దర్శకుడిగా మారిపోయారు. రామ్ మోస్ట్ ఎంబిషియస్ ప్రాజెక్టు.. #RAPO23 ఈ రోజే హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది.
నియో నోయిర్ బ్యాక్ డ్రాప్ లో..
సాధారణంగా రామ్ సినిమాలు అంటే మాస్, లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్స్ ఉంటాయి. కానీ ఈసారి ఆయన రూట్ మార్చి.. ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదీకూడా ఇండియన్ స్క్రీన్‌పై అరుదుగా వచ్చే ‘నియో నోయిర్’ (Neo-noir) బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ రోజే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి రామ్ అండ్ టీమ్ స్పీడ్ పెంచేసింది.
భారీ బడ్జెట్ తో..
దర్శకుడిగా మారిన రామ్ ఈ మూవీకి కథ రాయడమే కాకుండా, ముహూర్తం షాట్‌కు స్వయంగా యాక్షన్ చెప్పడం సెట్స్‌లో అందరినీ థ్రిల్ చేసింది. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని బడ్జెట్ రూ. 100 కోట్ల పైనే అని సమాచారం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు, లార్జర్ ద్యాన్ లైఫ్ ఫైట్స్ కంపోజ్ చేసే పీటర్ హెయిన్, ప్రొడక్షన్ డిజైనర్ ఎస్. ప్రకాష్ లాంటి ఇండస్ట్రీ బెస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రామ్‌కు జోడీగా గ్లామరస్ బ్యూటీ నివేదా పేతురాజ్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నటుడిగా ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిన రామ్.. ఇప్పుడు డైరెక్టర్‌గా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే #RAPO23 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రామ్ లోని సరికొత్త కోణాన్ని చూడటానికి ఫ్యాన్స్ ఇప్పుడే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు..
The Lone Wolf journey begins. 🐺🔥#RAPO23 kicks off with a Grand Pooja Ceremony 🤍
🎬 By Sravanthi RaviKishore
🎥 Switch on by Murali PothineniStarring Energetic Star @ramsayz ❤️🔥
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics production.… pic.twitter.com/A67jy78syK— RAPO Cinematics (@RAPO_Cinematics) June 29, 2026