Reading Time: 2 minutes
Jr Ntr Trivikram Srinivas New Movie Announcement Ntrivikram Poster Details

టాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయిక ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా మూవీ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా రూపొందనుందని ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ అధికారికంగా ప్రకటించారు. ఇక పోస్టర్ చూస్తె ఈ సినిమా ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని, ఒక వినూత్నమైన సోషియో-ఫాంటసీ లేదా పౌరాణిక నేపథ్యం ఉన్న కథ అని స్పష్టమవుతోంది. పోస్టర్ లో ప్రధానంగా మన దృష్టిని ఆకర్షించేది యుద్ధభూమిలో నిటారుగా గుచ్చుకుని ఉన్న ఒక భారీ ఆయుధం. పైకి చూడటానికి ఇది పరమశివుని త్రిశూలంలా కనిపిస్తున్నప్పటికీ, నిశితంగా గమనిస్తే దీనికి కుమారస్వామి (సుబ్రహ్మణ్య స్వామి) ఆయుధమైన ‘వేల్’కు మధ్య ఒక బలమైన సంబంధం ఉంది.

పోస్టర్ లో ఇంగ్లీషులో రాసిన “ONE SPEAR | ONE PURPOSE | ONE DIVINE RECKONING” అంటే (ఒక అస్త్రం, ఒకే లక్ష్యం, ఒక దైవిక తీర్పు) అనే వాక్యాలు ఈ ఆయుధం ఒక మహాశక్తివంతమైన ‘వేల్’ అని నిర్ధారిస్తున్నాయి. ఈ పోస్టర్ లో అత్యంత ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన అంశం ఆయుధం పైభాగం. ఆయుధం చుట్టూ కమ్ముకున్న పొగ, మబ్బులు కలిసి ఒక డి.ఎన్.ఏ ఆకృతిని ఏర్పరిచాయి. పౌరాణిక కాలం నాటి ఆయుధానికి, ఆధునిక జీవశాస్త్రం అలానే జన్యుశాస్త్రానికి మధ్య దర్శకుడు త్రివిక్రమ్ ఏదో బలమైన లింక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది కర్మ సిద్ధాంతం గురించా? లేక వంశపారంపర్యంగా వచ్చే ఒక దైవిక శక్తి గురించా? అన్నది కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
దానికి తోడు పోస్టర్ మధ్యలో ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకం పొందుపరచబడింది. ఆ శ్లోకం ఆదిశంకరాచార్యులు రచించిన సుబ్రహ్మణ్య భుజంగం లోనిది కావచ్చు లేదా కుమారస్వామిని స్తుతించే మరొక శక్తివంతమైన మంత్రం అయి ఉండొచ్చని అంటున్నారు.

ఈ కథకు సుబ్రహ్మణ్య స్వామి తత్వానికి ఏదో గట్టి లింకే ఉందని స్పష్టం చేస్తోంది. అలానే కాలిపోతున్న రథాలు, తెగిపడిన గుర్రాల ఆనవాళ్లు, ఎగిరుతున్న ఎర్రటి జెండాలు నెత్తురోడుతున్న ఒక చారిత్రక యుద్ధానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వెనుక భాగంలో మసకగా కనిపిస్తున్న పురాతన ఆలయ నిర్మాణాలు, గోపురాలు ఈ కథ ఏ కాలానికి చెందినది? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఇది ఇప్పటి వర్తమానానికి, గతానికి మధ్య జరిగే ఒక ప్రయాణంగా ఉండొచ్చు. ఇక ఎన్టీఆర్ (NTR), త్రివిక్రమ్ (TRIVIKRAM) పేర్లను కలిపి “NTRIVIKRAM”గా డిజైన్ చేసిన విధానం చాలా ఆకర్షణీయంగా ఉంది. రాక్ స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.