
IND-W vs AUS-W: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఆరంభమైన హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డుపై భారీ టోటల్ సెట్ చేయడమే లక్ష్యంగా ఇండియన్ అమ్మాయిలు టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే భారత్– ఆసీస్ తమ జట్లలో ఒక్కో మార్పుతో బరిలోకి దిగబోతున్నాయి.
ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ సోఫీ మోలినెక్స్ మాట్లాడుతూ.. టాస్ ఓడిపోయినప్పటికీ తాము కూడా మొదట బౌలింగ్ చేయాలనే ప్లాన్ చేసుకున్నామని తెలిపింది. పిచ్ కండిషన్స్, మ్యాచ్-అప్స్ బట్టి స్పిన్నర్ అలానా కింగ్ స్థానంలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (Pheebs) తిరిగి జట్టులోకి వచ్చినట్లు వెల్లడించింది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ మాకు చాలా కీలకం.. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం.. పిచ్ కండిషన్స్‌కు సూట్ అయ్యేలా నందిని ప్లేస్‌లో క్రాంతి గౌడ్‌ను టీమ్‌లోకి తీసుకున్నాం.. ఈరోజు ప్రశాంతమైన మైండ్ సెట్‌తో మ్యాచ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తామని హర్మన్‌ప్రీత్ ధీమా వ్యక్తం చేసింది. కాగా, మాజీ పేసర్ శిఖా పాండే ఊహించినట్లుగానే ఇన్-ఫామ్ బౌలర్ శ్రీ చరణి కూడా ఈ మ్యాచ్‌లో చోటు దక్కించుకుంది.
ఇరు జట్లు:
ఆస్ట్రేలియా మహిళల జట్టు: బెత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నబెల్ సదర్లాండ్, నికోలా క్యారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్
భారత్ మహిళల జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్
🚨 Toss Update from London 🚨#TeamIndia have won the toss and elected to bat against Australia.
Updates ▶️ https://t.co/WlUV2rjwTj#T20WorldCup | #WomenInBlue | #AUSvIND pic.twitter.com/A8gpMfnLhh
— BCCI Women (@BCCIWomen) June 28, 2026
#TeamIndia‘s Playing XI that will be taking the field in Lord’s 🙌
Updates ▶️ https://t.co/WlUV2rjwTj#T20WorldCup | #WomenInBlue | #AUSvIND pic.twitter.com/H6qCkdIqUC
— BCCI Women (@BCCIWomen) June 28, 2026