Reading Time: < 1 minute

ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక శాలరీ మనోడికే.. ఎవరీ శంఖ్ మిత్ర..?

Caption of Image.

ప్రపంచంలో అత్యధిక శాలరీ అందుకుంటున్న సీఈఓ ఎలాన్ మస్క్ అని దాదాపు తెలిసే ఉంటుంది. మస్క్ తర్వాత ఎక్కువ శాలరీ అందుకుంటున్న 2వ వ్యక్తి మన భారతీయుడే అని తెలుసా..? ఎంతో మంది సీఈఓలను దాటుకుని.. అత్యధిక శాలరీ పొందుతున్న వ్యక్తులలో రెండో స్థానంలో నిలిచిన ఈ ఇండియన్ గురించి తెలుసుకుందాం.

అమెరికాలో  రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT) వెల్‌టవర్ సీఈఓ శంఖ్ మిత్ర 821 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,000 కోట్లు) శాలరీ పొందుతూ ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో సెకండ్ ప్లేస్ సాధించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. 2025 సంవత్సరానికి సంబంధించిన ఈ ప్యాకేజ్‌లో ఎక్కువ భాగం స్టాక్ అవార్డుల రూపంలో ఉన్నట్లు పేర్కొంది. టెస్లా సీఈఓ మస్క్ ప్యాకేజ్ విలువ 158 బిలియన్‌ డాలర్లుగా ఉండగా ఆ తర్వాతి స్థానం మనోడిదే. 

 కోల్‌కతా నుంచి ప్రారంభమైన ప్రయాణం.. జీతం విషయంలో ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా నిలవడం ఇక్కడ గొప్ప విషయం. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అమెరికా వెళ్లి కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో MBA పూర్తి చేశారు.

2009లో ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో యానలిస్ట్‌గా చేరి, తర్వాత సిటాడెల్, మిలీనియం మేనేజ్‌మెంట్ వంటి సంస్థల్లో రియల్ ఎస్టేట్ సెక్యూరిటీలు, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ రంగాల్లో పని చేశారు. 2016లో వెల్‌టవర్‌లో చేరిన మిత్ర 2018లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా పదోన్నతి పొంది, 2020లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 

అప్పట్లో కంపెనీ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ జెఫ్రీ హెచ్ డొనాహ్యూ.. మిత్ర ఇన్వెస్టింగ్, ఆపరేషనల్  స్కిల్స్ ను మెచ్చుకున్నారు. మిత్రకు వ్యస్తున్న ప్యాకేజ్ లో సుమారు 99% స్టాక్ అవార్డుల రూపంలో ఉంది. అక్టోబర్‌లో ఇచ్చిన 789 మిలియన్ డాలర్ల స్టాక్ గ్రాంట్ ఏడాదికి ఒక బిలియన్ డాలర్లకు పైగా పెరుగుతూ వచ్చింది. 
 

©️ VIL Media Pvt Ltd.