Reading Time: < 1 minute
Pawan Kalyan Welcomes Fans To Og Universe Sujeeth Completes 70 Script Of Og 2

ఓజీ సినిమాకు పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమన్ మ్యూజిక్‌కు, సుజీత్ ఎలివేషన్‌కు థియేటర్ టాపులు లేచిపోయాయి. అందుకే  ఓజీ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన “Welcome to OG Universe” పోస్ట్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘OG’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ యూనివర్స్‌ను ప్రకటిస్తూ చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

ముఖ్యంగా ‘ఓజాస్ గంభీర’ పాత్రను మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు ‘OG’ సీక్వెల్‌పై పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఊహించిన దానికంటే త్వరగా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు సుజీత్ కూడా దూకుడు మీదున్నాడు. ఇప్పటికే OG 2 స్క్రిప్ట్ వర్క్ 70 శాతం పూర్తయిందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే అనుకున్న సమయానికంటే ముందే ఈ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఓజీ మూవీ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమాగా నిలిచింది. అందుకే ఓజీ 2 ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పవన్ కూడా వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ‘OG’ యూనివర్స్‌కు సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్లు వెలువడే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా  ఓజీ 2 ఓవర్ స్పీడ్‌లో  దూసుకెళ్తున్న చెప్పాలి