Reading Time: < 1 minute

RRB jobs: సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు.. మొత్తం 119 పోస్టులు.. డిగ్రీ పాసైతే మీకే ఛాన్స్..

Caption of Image.

రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్​బీలు) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశాయి.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 15 నుంచి ప్రారంభమవుతుంది.  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 14.

పోస్టు పేరు: సెక్షన్ కంట్రోలర్. 

మొత్తం పోస్టులు: 119. సికింద్రాబాద్ పరిధి దక్షిణ మధ్య రైల్వేలో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 20 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 15.

లాస్ట్ డేట్: ఆగస్టు 14. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rrbcdg.gov.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.