Reading Time: < 1 minute
Ketan Agarwal Murder Case Police Reveal Chetan Chaudharys 10 Hour Ghost Strategy

Ketan Agarwal Murder Case: పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్‌తో హత్య చేవారు. జూన్ 18న పూణేకు సమీపంలోని లోహగఢ్ కోటకు తీసుకెళ్లి, అక్కడి నుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో దొరకకుండా చేతన్ 10 గంటల 40 నిమిషాల పాటు మాస్టర్ ప్లాన్ చేశారు. ఇన్ని గంటల పాటు ‘‘డిజిటల్ బ్లాక్అవుట్’’ అమలు చేసిన తన ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ హత్యలో తన ప్రేమేయం లేదని నమ్మించేందుకు మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసి, సెల్ టవర్ ఆధారంగా తన లొకేషన్ ట్రాక్ చేయకుండా ఉండేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.

పోలీసులు వివరాల ప్రకారం.. జూన్ 18 ఉదయం 7 గంటల ప్రాంతంలో చేతన్ తన మొబైల్ డేటా ఆఫ్ చేశాడు. 8 గంటలకు తన ఫోన్ తన పెయింట్ షాప్‌లోనే వదిలి, కాల్స్ వస్తే సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు సూచించాడు. దీంతో హత్య జరిగిన సమయంలో షాప్‌లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు. లోహ్‌గఢ్ వెళ్లే సమయంలో తన ఉద్యోగి మొబైల్ ఉపయోగించాడు. మధ్యాహ్నం సమయంలో కోట వద్దకు చేరుకున్న చేతన్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, వింటర్ హుడీని ధరించి అసహజంగా కనిపించడం పోలీసులకు పట్టించింది. సీసీటీవీ కెమెరాల్లో కేతన్, సియాలను చేతన్ అనుసరిస్తున్నట్లు తేలింది.

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విన్చూ కటా సమీపంలోని ఏకాంత ప్రాంతానికి కేతన్, సియా చేరుకున్నారు. ముందే నిర్ణయించిన సిగ్నల్ ఇవ్వగానే సియా కూర్చోబవడంతో, సమీపంలో ఉన్న చేతన్, కేతన్‌ను 400 అడుగుల లోయలోకి తోసేశాడని పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత సాయంత్రం 5.40 గంటల వరకు చేతన్ తన మొబైల్ ఇంటర్నెల్ ఆన్ చేయలేదు. దాదాపుగా 10 గంటల పాటు తాను ఘటనా స్థలంలో లేనని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఏదైతే వ్యూహాన్ని అమలు చేశాడో, అదే వ్యూహం చేతన్‌ను పట్టించింది. చేతన్ మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఉండటం, ఫోన్‌కు ఆయన ఉద్యోగులు సమాధానం ఇవ్వడం, హుడీతో కనిపించడం కీలక ఆధారాలుగా మారాయి.