
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) నూతన ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.ఎస్. శ్రీనివాసరాజును ప్రభుత్వం నియమించింది. గతంలో రెరా ఛైర్మన్‌గా ఉన్న ఎన్. సత్యనారాయణ తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న కే.ఎస్. శ్రీనివాసరాజుకు బ్యూరోక్రసీలో సుదీర్ఘమైన, సమర్థవంతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజన అనంతరం కూడా ఆయన పలు కీలక శాఖల్లో ఉన్నత బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా TTD జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆయన సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు.
టీటీడీ జేఈవో బాధ్యతల అనంతరం తెలంగాణ క్యాడర్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కూడా ఆయన సమర్థవంతంగా పనిచేశారు. ఐఏఎస్ సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత గతేడాది ఆయనను సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన రెరా ఛైర్మన్ పగ్గాలను ఆయనకు అప్పగించింది.