
ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఫోక్స్ సాంగ్స్ నుంచి కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్ బుల్లి తెరపై కొన్ని షోల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇప్పటికే రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ కూడా హీరోయిన్ గా సినిమా చేస్తుంది. అలాగే ఫోక్ డాన్సర్ నాగ దుర్గ కూడా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తుంది. దాంతో ఫోక్ సాంగ్స్ క్రేజ్ మరింత పెరిగింది నెలకు అవలీలగా 10 నుంచి 15 సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి.
ఆడియన్స్ కూడా ఫోక్ సాంగ్స్ వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కొన్ని ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోక్ సాంగ్ చాలా మంది ఫేవరేట్ సాంగ్. ఫోక్ సాంగ్స్ లోనూ చాలా రకాల జోనర్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కువగా లవ్ సాంగ్స్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. అల్లాహే అల్లా అంటూ సాగే ఈ సాంగ్ చాలా హిట్ అయ్యింది. బెస్ట్ లవ్ సాంగ్ ఇది. బుల్లెట్ బండి సాంగ్ తో పాపులర్ అయిన లక్ష్మణ్ ఈ సాంగ్ ను రచించడంతో పాటు స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో పాటు డైరెక్షన్ కూడా చేశాడు.
ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. 269 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ సాంగ్.. ఈ సాంగ్ కు మదీన్ ఎస్కే సంగీతం అందించాడు. అలాగే ఈ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. 2022లో వచ్చిన ఈ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ప్రేమికులను ఎక్కువగా అలరించింది. ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ సాంగ్ లో విజువల్స్ , స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి