
హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్‌ఎండీఏ పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపునకు శనివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నగరంలోని మూడు జోన్ల పరిధిలో మొత్తం 15 ప్రధాన రహదారులపై 30.29 కిలోమీటర్ల మేర డ్రైవ్ నిర్వహించి 506 ఆక్రమణలను తొలగించారు. నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలోని ఐదు రహదారులపై 10.8 కిలోమీటర్ల మేర తనిఖీలు నిర్వహించి 197 ఆక్రమణలను తొలగించారు.
కూకట్‌పల్లి జోన్‌లోని మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి సర్కిళ్ల పరిధిలోని మూడు రహదారులపై 3.16 కిలోమీటర్ల మేర తనిఖీలు చేసి 105 ఆక్రమణలను తొలగించారు. కుత్బుల్లాపూర్ జోన్‌లోని చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలోని ఏడు రహదారులపై 15.53 కిలోమీటర్ల మేర తనిఖీలు నిర్వహించి 204 ఆక్రమణలను తొలగించారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.