Reading Time: 2 minutes

నల్గొండ నైట్స్ జోరు.. వరంగల్‌పై 91 పరుగుల భారీ గెలుపు

Caption of Image.

TG20 League: ఉప్పల్ వేదికగా జరిగిన టీజీ20 లీగ్ మ్యాచ్‌లో నల్గొండ నైట్స్ జట్టు వీరవిహారం చేసింది. వరంగల్ వారియర్స్‌తో జరిగిన పోరులో నల్గొండ జట్టు ఏకంగా 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన నల్గొండ.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ వరంగల్‌ను కట్టడి చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. నల్గొండ బ్యాటర్ల పవర్‌ఫుల్ హిట్టింగ్ వల్లే ఈ మ్యాచ్ పూర్తిగా వన్‌సైడ్ అయిపోయింది. 

బ్యాటింగ్ లో దుమ్మురేపిన గౌరవ్, నితీశ్ రెడ్డి: 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ నైట్స్ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 259 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టారు. నల్గొండ ఓపెనర్ గౌరవ్ రెడ్డి కేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేసి వరంగల్ బౌలర్లను ఆడుకోగా, నితీశ్ రెడ్డి 41 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి గౌరవ్‌కు ఈక్వల్‌గా అదరగొట్టాడు. వీరికి తోడుగా కెప్టెన్ రాహుల్ బుద్ధి 18 బంతుల్లో 31 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు), అఫ్రాజ్ అహ్మద్ 14 బంతుల్లో 33 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి దూకుడుగా ఆడారు. ఆఖర్లో దివేష్ సింగ్ 18 రన్స్ తో నాటౌట్‌గా నిలిచి వేగంగా పరుగులు రాబట్టాడు. వరంగల్ వారియర్స్ బౌలర్లలో అబ్దుల్ మాలిక్ 2 వికెట్లు తీయగా.. ముదాస్సిర్, శౌనక్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

►ALSO READ | ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌ను ఉతికారేసిన డెలానీ.. భారత్ ముందు 183 రన్స్ టార్గెట్ పెట్టిన ఐర్లాండ్!

చేతులెత్తేసిన వరంగల్ బ్యాటర్లు: 
260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ జట్టు 14 ఓవర్లలోనే 168 రన్స్ కే ఆలౌట్ అయింది. వరంగల్ జట్టులో కెప్టెన్ అమన్ రావు (46), మురుగన్ అభిషేక్ (44), భవేష్ సేథ్ (22) మాత్రమే కాస్త దూకుడుగా ఆడి పరుగులు చేశారు. కానీ మిగతా బ్యాటర్లలో హర్షిత్ చౌదరి (10), మణి కిరణ్ (16), ఆసిఫ్ (5), శౌనక్ (4), ముదాస్సిర్ (5), పల్లెపాటి క్రాంతి (5) పూర్తిగా విఫలమవడంతో వరంగల్‌కు ఘోర పరాజయం తప్పలేదు. 

©️ VIL Media Pvt Ltd.