Reading Time: < 1 minute
Saudi Aramco Helicopter Crash Kills 14 In Ras Tanura Investigation Underway

Saudi Arabia: సౌదీ అరేబియాతో ఘోర ప్రమాదం జరిగింది. గల్ఫ్‌లో హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న రాస్ తానూరాలో ఆదివారం ఆయిల్ దిగ్గజం అరామ్‌కోకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది సౌదీ జాతీయులు మరణించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలు నిర్ధారించడానికి సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు అరామ్‌కో వెల్లడించింది.

గల్ఫ్ లోని రాస్ తానూరా టెర్మినల్‌లో శుక్రవారం అరామ్‌కో ముడి చమురు లోడింగ్‌ను పున:ప్రారంభించిన రెండు రోజుల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. దాదాపుగా 4 నెలల తర్వాత ఈ టెర్మినల్‌లో లోడింగ్ మొదలైంది. అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసేలా శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత సౌదీ తన చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.