
సంక్రాంతికి ‘రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది ఎండింగ్లో మరోసారి ఆడియెన్స్ను పలకరించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టుల్లో నటిస్తుండగా, వాటిలో హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోం ది. తాజాగా మూవీ టీమ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. డిసెంబర్ 3న వరల్డ్ వైజ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
త్వరలోనే ఈ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. అలాగే ఆగస్టు 15 ఇం డిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేయనున్నారట. ఇదొక విజువల్ వండర్ గా ఉండబోతోందని టీమ్ చెబుతోంది. ఇందులో ప్రభాస్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ క్యారెక్టర్లో చూపించ బోతున్నామని అన్నారు.
ప్రభాస్ సరసన హీరోయిన్గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టిసిరీస్ గుల్షన్ కుమార్. భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.