
Australia vs India, Women’s T20 World Cup 2026 Live Score Updates: మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఈరోజు తేలనుంది. లార్డ్స్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
ఆస్ట్రేలియా దాదాపు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. రెండో స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. భారత్ 4 మ్యాచ్‌ల నుంచి 6 పాయింట్లతో +2.268 నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది. దక్షిణాఫ్రికా కూడా 6 పాయింట్లతో ఉంది, కానీ దాని నెట్ రన్ రేట్ +0.734గా ఉంది.
బంగ్లాదేశ్ 4 పాయింట్లతో పోటీలో ఉన్నప్పటికీ, దాని రన్ రేట్ (-0.849) చాలా పేలవంగా ఉంది. ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు 38 టీ20లలో తలపడగా, ఆస్ట్రేలియా 27, భారత్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.