
హైదరాబాద్, జూన్ 29: రాష్ట్రంలో2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్ (TG LAWCET), టీజీ పీజీఎల్‌సెట్ (TG PGLCET)–2026 ప్రవేశాల కౌన్సెలింగ్ మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో అందిస్తున్న మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ వేర్వేరు తేదీల్లో జరుగుతుందని లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం టీఎస్ లాసెట్ 2026కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ ప్రక్రియ జులై 5 నుంచి ప్రారంభం అవుతుంది. జులై 10, 2026 వరకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రాసెసింగ్ ఫీజుగా జనరల్/ ఓపెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. జులై 16 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వీరికి జులై 24న సీట్లు కేటాయిస్తారు.
ఇక ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు జులై 27 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 1, 2వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. వీరికి ఆగస్ట్ 5న సీట్లు కేటాయిస్తారు. లాసెట్, పీజీఎల్ సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ అడ్మిషన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది వెబ్‌సైట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.