Reading Time: < 1 minute

పాల ట్యాంకర్ బోల్తా.. బకెట్లు, బాటిల్స్ తో ఎగబడ్డ జనం..వీడియో వైరల్

Caption of Image.

పాలు ఫ్రీగా దొరుకుతున్నాయంటే ఎవరు ఆగుతారా? పాల ట్యాంకర్ బోల్తాపడితే పాలకోసం జనం  ఎలా ఎగబడ్డారో చూడండి. వార్త తెలిసిందో లేదో మరుక్షణమే  బాటిల్స్, క్యాన్లు, బకెట్లు, చివరికి పెద్ద పెద్ద డ్రమ్ములతో ప్రత్యక్షమయ్యారు.  పాలు రోడ్డుపై పారుతుంటే, ఒక్క చుక్క కూడా వృథా కాకూడదన్న బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నట్టుగా ఎవరికివారు నింపుకోవడంలో బిజీ అయిపోయారు. పాలకోసం  జనం పోటీపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసినవారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ పరిస్థితి ఏంటి? అన్నదానికంటే “ఇంకా పాలు వస్తున్నాయా?” అన్నదే అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. కొందరు క్యాన్లతో, మరికొందరు వాటర్ బాటిళ్లతో, ఇంకొందరు డ్రమ్ములతో ప్రత్యక్షమై.. క్షణాల్లోనే రోడ్డును పాల కలెక్షన్ సెంటర్ గా మార్చేశారు.

ఈ వీడియోలు చూసినవారు..మన దేశంలో ఏదైనా ఫ్రీ అంటే చాలు.. క్యూ కట్టడానికి టైమ్ పట్టదు!” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘పాలు కిందపోతే ఏమొస్తుంది.. మనుషులుతాగితేనన్నా కడుపు నిండుతుందని కొందరంటే..మరీ కక్కర్తి పడి డ్రమ్ములల్ల నింపుకుపోయి ఏం చేసుకుంటరు ’’అని మరికొందరు అంటున్నారు. ఇగ కొందరైతే ఫ్రీగా వస్తే మనోళ్లు ఫినాయిల్ కూడా తాగేస్తారంటూ సెటైర్లతో కామెంట్లు పెట్టారు.  ఇంకొందరైతే ‘‘ప్రమాదం జరిగితే చేతనైనా సాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తుంచుకోవాలి’’ అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.