Reading Time: < 1 minute
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్‌.. కట్‌ చేస్తే..

ప్రత్యేక పూజలు, దోష పరిహారాల పేరుతో అమాయకులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఒక కిలాడీ ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నిందితుడిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టయిన వ్యక్తిని చామర్తి రామ లచ్చారావుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు రామ లచ్చారావు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నమ్మించి, పూజల పేరుతో ఏకంగా రూ.20 లక్షలు గుంజాడు. అంతటితో ఆగకుండా, మరిన్ని డబ్బులు ఇవ్వకపోతే చేతబడి చేస్తానంటూ సదరు బాధితుడిని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విదేశాలకు పారిపోవడంతో అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికాలో కూడా ఇతడు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు సమాచారం. అమెరికాలో అతడు నిర్వహిస్తున్న ఆలయానికి సంబంధించిన వివాదాలు, అక్కడ నమోదైన కేసుల నేపథ్యంలో భయంతో భారత్‌కు తిరిగి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకోగా.. అనంతరం సంబంధిత పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో చామర్తి రామ లచ్చారావు మోసాల వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూజలు, ప్రత్యేక పరిహారాలు, చేతబడిని తొలగిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట.. భయంతో పరుగులు తీసిన ఇంటి యజమాని

కేజీఎఫ్ కాదు బాస్.. అంతకు మించి.. మేడిన్ ఆంధ్ర గోల్డ్ వచ్చేసింది!

వందే భారత్ ఏసీ కోచ్‌ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్‌తో లుక్‌ అదిరిందిగా!