
ప్రస్తుత బిజీ లైఫ్‌లో గంటల తరబడి సమయం వెచ్చించి సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడలేని వారి కోసం ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ’12త్ ఫెయిల్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మాస్సే, బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా, అనుప్రియ గోయెంకా ప్రధాన పాత్రల్లో నటించిన లఘు చిత్రం (Short Film) పేరు ‘కాపీ’. కేవలం 40 నిమిషాల రన్ టైమ్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌కు గురి చేస్తుంది. 2018లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్టులు ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాంక్ చేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..
కథా నేపథ్యం:
ఈ చిత్రంలో సిద్ధార్థ్ (విక్రాంత్ మాస్సే) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే అహంకారి. భార్య మమత (సుర్వీన్ చావ్లా)తోనూ, ఆఫీస్ సిబ్బందితోనూ ఎప్పుడూ కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దీనికి తోడు సిమోనా (అనుప్రియ గోయెంకా) అనే అమ్మాయితో అతనికి వివాహేతర సంబంధం కూడా ఉంటుంది. సంసార జీవితం, ఆఫీస్ ఒత్తిడి, అక్రమ సంబంధం… ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం సిద్ధార్థ్‌కు కష్టంగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి అతను సైన్స్ టెక్నాలజీ సహాయంతో అచ్చం తనలాగే కనిపించి, మాట్లాడే ఒక ‘హ్యూమనాయిడ్ రోబో’ను కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి? క్లైమాక్స్‌లో వచ్చే ఆ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఏంటి? అనేదే ఈ సినిమా కథ.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
ఈ చిత్రం 2007లో ఎస్.జె.సూర్య హీరోగా తమిళంలో వచ్చిన ‘వ్యాపారి’ చిత్రానికి రీమేక్ అని టాక్ ఉంది. ఈ హిందీ వెర్షన్‌ను ప్రముఖ దర్శకుడు అరిందమ్ సిల్ తెరకెక్కించగా, ప్రముఖ దర్శకుడు సుజయ్ ఘోష్ స్క్రీన్‌ప్లే అందించారు. అతి తక్కువ లొకేషన్లలో ఎంతో పకడ్బందీగా స్క్రీన్‌ప్లేతో నడిచే ఈ చిత్రానికి IMDbలో 7.5/10 రేటింగ్ లభించింది. మంచి సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్న భిన్నమైన చిత్రాన్ని తక్కువ సమయంలో చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఈ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..